Tuesday 17 January 2017

సెల్ఫీ వ్యసనం

                                                                                  సెల్ఫీ కూడా ఒక వ్యసనమే అన్న విషయం చాలా మందికి తెలియకుండానే దానికి బానిస అయిపోతున్నారు.చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యసనం బారిన పడుతున్నారు. కాలు లోపల పెడితే సెల్ఫీ,కాలు బయట పెడితే సెల్ఫీ.బస్సు,రైలు ఎక్కుతుంటే దిగుతుంటే సెల్ఫీ.కాలుజారి క్రిందపడి ప్రమాదాలు,చనిపోవడాలు అంత అవసరమా?పిచ్చిగోల.దీనికి తోడు ప్రతిదాన్నిముఖ పుస్తకం లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టడం ఎదుటివాళ్ళు నచ్చినా నచ్చకపోయినా లైక్ పెట్టాలని ఎదురు చూడడం నేడు పరిపాటి అయిపోయింది.పెట్టకపోతే దిగులు పడటం,పదేపదే చరవాణి వైపు చూస్తూ నిరుత్సాహ పడుతూ భోజనం సరిగా చేయకపోవడం,ఒత్తిడి,ఆందోళన పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ సెల్ఫీపిచ్చి అనే వ్యసనం వల్ల ఎంతో మంది మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు.ఈ సెల్ఫీ వ్యసనం నుండి ఎంత త్వరగా బయట పడగలిగితే అంత మంచిది.దీని నుండి బయట పడలేకపోతే మానసిక వైద్యులను సంప్రదించే పరిస్థితి వస్తుంది.తస్మాత్ జాగ్రత్త.

No comments:

Post a Comment